రేపటి నుండి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ..
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/Sis-gaurantees-logo.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రేపటి నుండి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో ఐదు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్మారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని.. జనవరి 7 లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలు అందించడానికి ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తున్నట్లు సిఎం తెలిపారు.