యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ..
యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. స్వాతి నక్షత్రం పురస్కరించుకొని పంచనారసింహ ఆలయ ఉద్ఘాటన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. దీనిలో భాగంగా పంచ కుండాత్మక మహాయాగానికి అంకురార్పణ చేశారు. బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని 108 కలశాలతో 108 దేవతారాధనలు జరిపి విశిష్ట అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు ఆరాధనలను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుండి మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన, అష్టదిక్పాలకుల ప్రతి ష్టాపర్వం చేపడతారు.