అగ్ర‌గామి రాష్ట్రాన్ని అవ‌మానిస్తే ఎట్టి ప‌రిస్థితిల్లో ఊరుకోం.. కెటిఆర్

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌ను ప్ర‌తిష్ట‌ను దిబ్బ‌తేసే విధంగా అగ్ర‌గామి రాష్ట్రాన్ని అవ‌మానిస్తే ఊరుకోబోమ‌ని కెటిఆర్ హెచ్చరించారు. తొమ్మిదిన్న‌రేళ్ల తెలంగాణ ప్ర‌గ‌తి ప్ర‌స్థానం.. దేశ చ‌రిత్ర‌లోనే ఓ సువ‌ర్ణ అధ్యాయ‌మ‌ని ఆయ‌న అన్నారు. రాత్రి-ప‌ట‌లు తేడా లేకుండా చెమ‌టోడ్చి తెలంగాణను నిర్మించామ‌ని.. విఫ‌ల రాష్ట్రంగా చూపే ప్ర‌య‌త్నం చేస్తూ, అగ్ర‌గామి రాష్ట్రాన్ని అవ‌మానిస్తే స‌హించేది లేద‌న్నారు. గ‌త తొమ్మిదిన్న‌రేళ్ల బిఆర్ ఎస్ పాల‌న‌పై ‘స్వేద‌ప‌త్రం’ పేరిట రేపు తెలంగాణ భ‌వ‌న్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గ‌ణాంకాల‌తో స‌హా.. వాస్త‌వ తెలంగాణ ముఖ‌చిత్రాన్ని వివ‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అప్పులు కాదు.. రాష్ట్రం సృష్టించిన సంప‌ద‌ను ఆవిష్క‌రిస్తామ‌ని కెటిఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.