వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ ధరలను కూడా పెంచారు. గత సంవత్సరం అక్టోబర్‌లో రూ. 15 పెరిగిన గ్యాస్ ధర.. ఇప్పుడు తాజాగా రూ. 50 పెంచారు. 14 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,002కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,008కు పెరిగింది. ఈ ధరలు నేటి నుండి అమలులోకి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ప్రపంచ పరిణామాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.