రేపు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు
హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సెలవు ఇస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో మహిళా బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీనుండి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రజాప్రతినిధలు వివిధ కార్యక్రమాలే నిర్వహిస్తూ, మహిళా అభ్యన్నతికి సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. మానవహారాలు, ప్రదర్శనలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు సత్కారాలు, కాల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలతో రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు.