India Corona: కొత్తగా 2.58 లక్షల కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా రెండులక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 13,13,444 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,58,089 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
అలాగే గడిచిన 24 గంటల వ్వవధిలో దేశంలో 358 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసులు 3,73,80,253కి చేరాయి.
గత 24 గంటల్లో 1,51,740 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా రికవరీలతో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,53,37,461కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 16,56,341 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.