తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ నియామకం
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి వికాస్‌రాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న వికాస్‌రాజ్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ ఉత్పత్తులు జారీ చేశారు. వికాస్ రాజ్ తెలంగాణ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.