విద్యా రంగంలో పెనుమార్పులు చేపడతాం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నాణ్యత విద్యపై దృష్టి, పాఠశాలలకు పూర్వవైభవం తెస్తాం..

జ‌న‌గామ‌ (CLiC2NEWS): విద్యార్థుల సౌకర్యాలు మెరుగుకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పాలకుర్తిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో,దేవరుప్పుల మండలం రామరాజు పల్లి పాఠశాలలో పాలకుర్తి మండల మనఊరు..మనబడి ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని మంత్రి మనఊరు..మనబడి ప్రణాళిక సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలోనూ నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రస్తుతం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలన్న ధృడ సంకల్పంతో అత్యంత ప్రాధాన్యతనిస్తూ, దేశంలో గొప్ప స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి  అన్నారు.

తెలంగాణ రాష్ట్రం విద్యకి ప్రాధాన్యతనిచ్చి మరింత ఉన్నత స్థానం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో 7400 కోట్లు కేవలం విద్య పైనే ఖర్చు పెడుతూ గ్రామాలను అభివృద్ధి పరుస్తున్న మన్నారు. తొలివిడతగా జిల్లాలోని మొత్తం 508 పాఠశాలల్లో 35శాతం గా 176 పాఠశాలలను ఎంపిక చేసామని ఆ యా పాఠశాలలను కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన బోధన కు చర్యలు తీసుకుంటామన్నారు.పాలకుర్తి లో 24, కొడకండ్లలో 11, దేవరుప్పుల లో18 పాఠశాలలను మొదటి విడతలో 12 అంశాలతో చేపట్టి అభివృద్ది పరుస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టి కృషితో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రణాళికా పరంగా చేపట్టి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు.

ముఖ్యంగా దాతల సహకారం కోరాలని, పూర్వ విద్యార్థులతోను యువజన,మహిళ సంఘాలతోను, సీనియర్ సిటిజన్ లతోను అంచెలంచెలుగా గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, వేలల్లో విరాళం లకు దాతల పేర్లు బోర్డ్ పై వ్రాయించాలని, లక్షల్లో ఇస్తే తరగతి గదులు పేర్లు పెట్టాలని తెలియజేసారు. తద్వారా తమ గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలనే స్ఫూర్తి కలుగుతుందని, గొప్పఉద్దేశంతో తప్పనిసరిగా దాతలు మరింతగా ముందుకు వస్తారని, ఆ దిశగా సమన్వయంతో కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్స్, మరుగుదొడ్లు, నీటి సౌకర్యాలు వంటి మౌలికవసతుల సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలన్నారు. పాఠశాలల్లో క్రీడలకు గ్రౌండ్ ఏర్పాటు చేయాలని పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటి చక్కని వాతావరణాన్ని కల్పించాలన్నారు.

దాతల విరాళాలు బట్టి కోటికి పైగా ఇస్తే పాఠశాల కే వారి పేరు పెట్టా లన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి యువజన సంఘాలు, పూర్వ విద్యార్థులు, దాతలను సమావేశపరచాలని గ్రామ అభివృద్ధి పై చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

బాల వికాస సంస్థ చైర్మన్ శౌ రెడ్డి సూచించినట్లుగా విద్య రంగం పుంజుకునేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేట్ స్థాయిలో సైన్స్ ల్యాబ్ లు డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

ప్రజాప్రతినిధులు పలువురు ముందుకు వచ్చి తనవంతుగా లక్ష రూపాయలను తాను చదువుకున్న పాఠశాలకు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించడంతో మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే తరహాలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు సమాజంలో మన బాధ్యత కూడా ఉందనే విషయం ఈ సందర్భంగా ప్రజలకు తెలుస్తుందన్నారు.

అనంతరం రామరాజుపల్లి గ్రామంలో పర్యటిస్తూ ప్రజల కోరిక మేరకు వనపర్తి వరకు రోడ్డు మంజూరు చేస్తామని, మసీదు పనులు ప్రారంభిస్తామని,సింగరాజుపల్లి, నీర్మాల,రామరాజుపల్లి గ్రామాలలో డివైడర్ లకు లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్లు భాస్కర్, అబ్దుల్ హమీద్, జడ్పి సి.ఈ.ఓ.విజయలక్ష్మి, దేవరుప్పుల జడ్పిటిసి భార్గవి పాలకుర్తి, కొడకండ్ల దేవరుప్పుల ఎంపిపి లు నల్లా నాగిరెడ్డి, జ్యోతి, సావిత్రమ్మ దేవరుప్పుల ఎంపిటిసి కల్యాణి, డి.ఆర్.డి.ఓ. రాంరెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్ రావు, డి.సి.సి.బి. అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, విద్యాశాఖ అధికారి రాము, పంచాయతీ అధికారి రంగాచారి , జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ఎంపిటిసిలు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్లు, బాల వికాస సంస్థ చైర్మన్ శౌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.