ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు..
AP: లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖాళీగా ఉన్న 4 లా క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి లా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 30ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు. ఒబిసిలకు మూడేళ్లు, ఎస్/ ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 35వేలు.
దరఖాస్తులను హైకోర్ట్ ఆప్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా- 522 239 చిరునామాకు ఆఫ్‌లైన్‌లో పంపించాలి.