అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు మృతి..!

టెక్సాస్ (CLiC2NEWS): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జాన్సన్ కౌంటీలో టెక్సాస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరణించిన ఆరుగురులో ఐదుగురు ఎపిలోని అమలాపురంకు చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.