తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో తెలుగు బోధన తప్పని సరి చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. సిబిఎస్ ఇ, ఐసిఎస్ ఇ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. 9వ తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుండి.. పదో తరగతి విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం నుండి అమలు చేసేలా చూడాలని రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.