పుడ్ ప్రాసెసింగ్ శిక్ష‌ణ సెంట‌ర్‌ను ప్రారంభించిన శాస‌నమండ‌లి స‌భ్యులు తోట త్రిమూర్తులు

మండపేట (CLiC2NEWS): నేడు ఆహార శుద్ధి పరిశ్రమకు ఎనలేని భవిష్యత్తు ఉందని చిన్నతరహా కుటీర పరిశ్రమల ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చునని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఏడిద గ్రామంలో డీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ భవన్ లో ఫుడ్ ప్రాసెసింగ్ శిక్షణ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట పరిసర ప్రాంతాల నిరుద్యోగులు పరిశ్రమల రంగం లోకి ప్రవేశించాలంటే తొలుత ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందాలన్నారు. శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అనుసంధానం చేసి నిరుద్యోగ యువతీ యువకులకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఆయన తెలిపారు. అందరూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు. శిక్షణా కేంద్రం సీఈవో కామన చంద్రప్రకాష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం ద్వారా ప్రాజెక్టు వ్యయంలో 35% బ్యాంకుల ద్వారా రుణం అనుసంధాన రాయితీ కల్పిస్తామన్నారు. బ్యాంకులన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు చేయూత ఇస్తుందన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ, దూలం వెంకన్నబాబు, ఎంపీపీ వుండమట్ల శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు కురుపూడి భవాని, కపిలేశ్వరపురం జడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి వీరవెంకట సూర్యనారాయణ(ఆబ్బు), సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, డీసీసీబీ సిఈవో నరసింహారావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ టిఎం నరసింహారావు, ఏడిద బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ పి సాయి సాగర్, ఎస్ బీ ఐ బజార్ బ్రాంచ్ మేనేజర్ టి హరి తదితరులు పాల్గొని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ శిక్షణ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, వారికి సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, తహసీల్దార్ తంగెళ్ల రాజ రాజేశ్వరరావు, ఎంపీడీవో ఐదం రాజు, డీఎన్ఆర్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ కామన ప్రభాకరరావు, ట్రస్టు సభ్యులు కోశెట్టి సత్యనారాయణ, గండ్రోతు రామచంద్రరావు, పర్వతిన వీర వెంకట సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు రామిశెట్టి శ్రీహరి, గ్రామ ప్రముఖులు కాటూరి అమ్మినీడు చౌదరి, కే కృష్ణ సాయి, ఎంపీటీసీ సభ్యులు చొల్లంగి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.