ఉక్రెయిన్‌లో లక్ష ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..

కీవ్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోనీ సుమీ ప్రాంంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, దాదాపు లక్ష ఇళ్లకుపైగా అంధకారంలో చిక్కుకుపోయాయి. రష్యా సరిహద్దు ప్రాంతమైన సుమీ రిజియన్‌లో డ్రోన్ల దాడులు కారణంగా సుమీ నగరంలో నీటి సరఫరాకు ఆటంకం కలిగినట్లు, కరెంటు సరఫరా నిలిచిపోయినట్లు విద్యుత్‌శాఖ ప్రకటించినట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. మరోవైపు డొనెట్స్క్ రీజియన్‌పై మాస్కో జరిపిన దాడుల్లో 11 మంది పౌరులు మృతి చెందగా.. 43 మంది గాయపడినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 70కిపైగా గ్లైడ్ బాంబులు, ఆరు రాకెట్లను రష్యా ప్రయోగించిందిని, 55 వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం.