బాసర జ్ఞానసరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

నిర్మల్ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా వసంతి పంచమి సందర్భంగా సరస్వతీ దేవి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బాసరర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి దేవదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయంలో ఆర్ధరాత్రి నుండి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవరి దర్శనం కోసం క్యూలైన్ల లో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం, పూజలు నిర్వహిస్తున్నారు.