హింసను తక్షణమే ఆపండి.. రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోడి విజ్ఞప్తి
ఢిల్లీ (CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్రమోడి గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే హింసను నిలిపివేయాలని , దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయనకు సూచించారు. రాష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ విషయంలో తలెత్తిన పరిణామాల గురించి ప్రధానికి వివరించారు. దానికి మోడి స్పందిస్తూ రష్యా, నాటో గ్రూపుల మధ్య ఏర్పడిన విభేదాలను చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని , అదే తమ ధీర్ఘకాల విధానమని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రత గురించి పుతిన్‌ను ప్రధాని అప్రమత్తం చేశారు. ఆ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత విషయాన్ని ప్రస్తాయించారు. వారిని సురక్షితంగా భారత్‌కు రప్పించడమే తమకు అత్యంత ప్రధానమని మోడి తెలిపారు. ద్వైపాక్షిక ప్రయోజనాతో ముడిపడిన అంశాలపై ఇరుదేశాల అధికారులు,దౌత్య బృందాలు నిరంతరం సంప్రదింపులు కొనసాగించాడానికి నేతలిద్దరూ అంగాకరించినట్లు సమాచారం.