తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో గురువారం ఉదయం పలుచోట్ల వర్షం కురిసింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లనిగాలులతోపాటు చిరుజల్లులు కురవడంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరిత ద్రోణి ప్రభావం, వాతావరణంలో చోటుచేసుకున్న మారు్పులతో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది.
నారాయగూడ, బాగ్‌లింగంపల్లి, ఓయు క్యాంపస్, తార్నాక, రాంనగర్, క్రాస్ రోడ్డ్స్, చార్మినార్,చాంద్రయాణ గుట్ట, బహదుర్‌పురా, యాకుత్‌పురా, ఖైరతాబాద్, అత్తాపూర్, రాజేంద్రనగర్, బండ్లగూడ, శంషాబాద్, గండిపేట్,..
సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, కోఠీ, దిల్‌సుఖ్‌నగర్, తదితర ప్రాంతల్లో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.