యువ‌కుడు ఛాతీలో దిగిన బాణం.. నిమ్స్‌లో శ‌స్త్ర చికిత్స..

హైద‌రాబాద్ (CLiC2NEWS): బాణం ఛాతీలోకి దిగిన ఓ యువ‌కుడికి శ‌స్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు నిమ్స్ వైద్యులు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన ఓ గిరిజ‌న యువ‌కుడికి ప్ర‌మాద‌వవాత్తూ బాణం ఛాతీలోకి దిగింది. అధిక ర‌క్త‌స్రావ‌మై న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తన్న అత‌నిని వెంట‌నే భ‌ద్రాచలం ఏరియా ఆసుప‌త్రికి తీసుకొచ్చారు. అక్క‌డినుండి వ‌రంగ‌ల్ ఎంజిఎంకు.. అక్క‌డి నుండి హైద‌రాబాద్ నిమ్స్‌క తీసుకొచ్చారు. నిమ్స్ వైద్యులు అత‌నికి 3 గంట‌ల‌పాటు శ‌స్త్ర చికిత్స నిర్వహించి యువ‌కుడు ప్రాణాలు కాపాడారు.
ముందుగా యువ‌కుడికి సిటీస్కాన్ చేయ‌గా ఊపిరితిత్తుల ప‌క్క నుండి గుండెలోని కుడి క‌ర్ణిక‌లోకి బాణం దిగింది. ఓవైపు ర‌క్తం ఎక్కిస్తూ విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు.

Leave A Reply

Your email address will not be published.