తెలంగాణలో బిజెపి వస్తే.. బిసి నేత ముఖ్యమంత్రి..!: అమిత్ షా

సూర్యాపేట (CLiC2NEWS): కేంద్ర మంత్రి అమిత్ షా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బిజెపి జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్‌కు, సోనియాకు వాళ్ల కుటుంబ సభ్యులనే పదువుల్లో కూర్చోబెట్టడమే ముఖ్యమని.. బిజెపి మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు. తెలంగాణలో బిజెపి గెలిస్తే.. బిసి నేతను ముఖ్యమంత్రిని చేస్తామని మంత్రి అమిత్‌షా ప్రకటించారు.
ఈ సందర్బంగా మంత్రి.. రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కెసిఆర్ చెప్పాలని,, రూ. 50 వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో కూడా తెలపాలన్నారు. అంతేకాకుండా రూ. 10 వేల కోట్లతో బిసి సంక్షేమ కార్యక్రమాలు అన్నారు. ఏం చేశారో తెలపాలన్నారు. బిసిల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ బద్ధంగా బిసి కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోడీ ముందుకు వచ్చారని.. తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబు్యునల్ ఏర్పాటు చేశారని తెలిపారు.