బాపట్లలో సమంతకు గుడి కడుతున్న అభిమాని
బాపట్ల (CLiC2NEWS): హీరోయిన్ సమంతకు గుడి కడుతున్నాడు ఓ అభిమాని. తాను ఇప్పటివరకు ఆమెను డైరెక్టుగా చూడనేలేదట.. ఆమె చేస్తున్న మంచి పనులకు.. ముఖ్యంగా సేవా కార్యక్రమాలకు ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. బాపట్ల జిల్లాలోని చుండూరు మండలం అలపాడుకు చెందని సందీప్.. సినీనటి సమంతకు గుడి కడుతున్నాడు. తనకు సమంత అంటే పిచ్చి అభిమానమట. ప్రత్యుష ఫౌండేషణ్ ద్వారా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న సేవాకార్యక్రమాలకు తన అభిమానం మరింత పెరిగి.. ఆమెకు గుడి కట్టిస్తున్నాడు. ఆ గుడికి మెరుగులు దిద్దే పని జరుగుతుంది. ఈ నెల 28 వ తేదీన గుడిని ప్రారంభిస్తున్నట్లు సమాచారం.