తెలంగాణ‌లో టెన్త్ రిజ‌ల్ట్స్ వ‌చ్చేశాయ్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ‌వ‌నరుల కేంద్ర (ఎంసిహెచ్ ఆర్‌డి)లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫ‌లితాలు విడుద‌ల చేశారు. మే 23వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వ‌ర‌కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రయ్యారు. ఫ‌లితాల్లో 90% ఉత్తీర్ణ‌త న‌మోదైంద‌ని మంత్రి స‌బిత వెల్ల‌డించారు. బాలురులో 87.61%, బాలిక‌ల్లో 92.45% ఉత్తీర్ణ‌త సాధించారు. ఆగ‌స్టు 1వ తేదీ నుండి 10 వ‌రుకు అడ్వాన్స్‌డ్ స‌ప్లిమొంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.