విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య..

మధురవాడ (CLiC2NEWS): బదిలీపై వెళ్లి బాధ్యతలు చేపట్టిన తొలిరోజే తహసీల్దార్ దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లా మధురవాడలోని కొమ్మాదిలో చోటుచేసుకుంది. విశాఖ రూరల్ తహసీల్దార్‌గా ఉన్నే సనపల రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతుల చేపట్టి ఇంటికి చేరుకున్న అనంతరం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సిసిటివి పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొమ్మాదిలోని ఓ ఆపార్ట్ మెంట్ ఐదో అంతస్తులో రమణయ్య నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల తరువాత ఆపార్ట్మెంట్ గేటువద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సిసిటివిపుటేజ్లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగడంతో దుండగుడు ఇనుపరాడ్‌తో తహసీల్దార్‌పై దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. తలకు గాయమైన రమణయ్య కుప్పకూలిపోగా, వాచ్మెన్ గమనించి కుటుంబసభ్యులకు సమాచారమందించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. శనివారం తెల్లవారుజామును ఆయన మృతిచెందాడు. పోలీసులు నిందుతులు కోసం గాలిస్తున్నారు.