నేపాల్‌లో ఘోర విమాన ప్ర‌మాదం.. భారీగా మృతుల సంఖ్య‌?

పొఖారా (CLiC2NEWS): నేపాల్ ఘోర విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. కాఠ్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బ‌య‌లుదేరిని య‌తి ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎటిఆర్ 72 విమానం కుప్ప‌కూలింది. ప్ర‌మాద స‌యంలో న‌లుగురు సిబ్బందితో స‌హా 68 మంది ప్ర‌యాణికులు విమానంలో ఉన్నారు. ఈ ప్ర‌మాదాన్ని య‌తి ఎయిర్‌లైన్స్ అధికారి సుద‌ర్శ‌న్ బ‌ర్తౌలా ధ్రువీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 30కి పైగా మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ అధికారి తేక్ బ‌హ‌దూర్ స్థానిక మీడియాకు వెల్ల‌డించారు.
ప్ర‌మాదం జ‌రిగిన విమానంలో 10 మంది విదేశీయులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘ‌ట‌న‌పై నేపాల్ ప్ర‌ధాని పుష్ప‌క‌మ‌ల్ దుహ‌ల్ విచారం వ్య‌క్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌ను ప్ర‌ధాని ఆదేశించారు

Leave A Reply

Your email address will not be published.