ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి

శ్రీనగర్ (CLiC2NEWS): జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు మృతి చెందారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. వాహనం నిలిచిపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిన్న ఆదివారం రాజౌరీ వద్ద సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఓ జవానుకి గాయాలయ్యాయి. సైనికులు ఎదుకాల్పులు జరపగా పరారయ్యారు. రెండో రోజే ఉగ్రమూక మరోసారి దాడికి పాల్పడటం గమనార్హం.