తెలంగాణలో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర..!
పేలుడు పదార్థాలు తరలించే ఉగ్రవాదులు అరెస్ట్
చండీగడ్ (CLiC2NEWS) హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఓ టోల్ ప్లాజా వద్ద అనుమానిత నలుగరు ఖలీస్థానీ ఉగ్రవాదులను పోలీసుల అరెస్టు చేశారు. తెలంగాణకు పేలుడు పదార్థాలు తరలించేందుకు యత్నించిన నలుగురు ముష్కరులు కుట్రను పోలీసలు భగ్నం చేశారు. వీరికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల సమచారం మేరకు తెలంగాణ, పంజాబ్, హరియాణా పోలీసులు సంయుక్త అంతరాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీని గుర్తించారు. ఆ వాహనంలో భారీగా ఆయుధాలు, ఐఈడిలు, ఆర్డీఎక్స్, 30 కాలిబర్ పిస్టళ్లు ఉన్నాయి. దీంతో వాహనంలోని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన వీరిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఈ ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
నలుగురు వ్యక్తులను విచారించగా అనేక కీలక విషయాలు వెలుగుచూసాయి. వారి వద్ద ఉన్న ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుండి తీసుకున్నట్లు తెలిపారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పినట్లు సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా వీటిని పంపినట్లు అధికారులు తెలిపారు.