అల్ట్రావ‌య‌లెట్ నుండి తొలి విద్యుత్ స్కూట‌ర్‌..

Tesseract : విద్యుత్ మోటార్ సైకిళ్లు త‌యారీ సంస్థ అల్ట్రావ‌య‌లెట్‌.. టెసెరాక్ట్ (Tesseract) పేరుతో తొలి ఇవి స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్ లో దీని ధ‌ర రూ. 1.20 ల‌క్ష‌లు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణ‌యించింది. కానీ ఇది తొలి 10వేల మంది క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మేన‌ని పేర్కొంది. యుద్ధ విమానాల స్పూర్తితో ఈ స్కూట‌ర్‌ను రూపొందించిన‌ట్లు.. భ‌విష్య‌త్‌లో యూరోపియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స్కూట‌ర్ లాంచ్ సంద‌ర్బంగా కంపెనీ తెలిపింది. స్కూట‌ర్ ముందు భాగం షార్ప్ క‌ట్స్‌తో క‌నిపిస్తుంది. డిసెర్ట్‌, స్టెల్త్ బ్లాక్, సోనిక్ పింక్ రంగుల్లో అందుబాటులో ఉంది. దీనిలో ఉన్న 6kWh బ్యాట‌రీ .. సింగిల్ ఛార్జ్‌తో ఈ స్కూట‌ర్ 261కిలో మీట‌ర్లు ఐడిసి రేంజ్ ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇందులో అమ‌ర్చిన ఎల‌క్ట్రిక్ మోటార్ 20 హెచ్‌పి ప‌వ‌ర్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. కేవ‌లం 2.9 సెకెన్ల‌లో 0 నుండి 80 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంటుంద‌ని తెలిపారు. టాప్‌స్పీడ్ 125 కిలోమీట‌ర్లు. బ్యాట‌రీపై ఎనిమిదేళ్ల పాటు బ్యాట‌రీపై వారెంటీ ఇస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.