తెలంగాణలో టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్మత పరీక్ష (టెట్ 2024) హాల్టికెట్లు విడుదలయ్యాయి . గురువారం సాయంత్రం వెబ్సైట్లో ఉంచారు. మే 20వ తేదీ నుండి జూన్ 2వరకు జరిగే పరీక్షల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థలు తమ జనరల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్ష కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఫలితాలను జూన్ 12వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది.