రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. జులై 1వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసినదే. ముందు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా జూన్ 27వ తేదీన టెట్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ, ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. తాజాగా ఫలితాల విడుదలపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది.