టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 21 మంది మృతి
వాషింగ్టన్ (CLiC2NEWS): అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో 18 సంవత్సరాల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 చిన్నారులు సహా మొత్తం 21 మంది మృతి చెందారు. మరణించి విద్యార్థుల వయస్సు 4 నుంచి 11 మధ్య ఉంటుందని అధికారులు వెల్లడించారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలో ఘటన చోటుచేసుకుంది. అక్కడ పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
18 యేళ్ల సల్వడార్ రామోస్ అనే యువకుడు మంగళవారం ఒంటి గంట సమయంలో ఉవాల్డేలోనిరాబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ పాఠశాలలో మొతత్ం 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. సమాచరం అందుకున్న పోలీసులు అప్రమత్తమై పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.