రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2,3 పరీక్షల వాయిదాకు అంగీకరించినట్లు సమాచారం. గ్రూప్-2 , డిఎస్‌సి పరీక్షలకు వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో వాయిదా వేయాలని వచ్చిన అభ్యర్థనల మేరకు గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపి మల్లు రవి వెల్లడించారు. గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 7,8 తేదీల్లో , గ్రూప్ -3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది.
గ్రూప్ -2 పరీక్షల అంశంపై రాష్ట్ర డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులో చర్చించారు. ఈ చర్చల్లో ఎంపిలే మల్లు రవి, బలరాం నాయక్, గ్రూప్-2 అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి టిజిపిఎస్‌సి ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. డిసెంబర్‌లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఉంటుందిన తెలిపారు. ఈ శిక్షణ కోసం నిపుణులను తీసుకొస్తామని, హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌లో బోదన ఉంటుందని భట్టి విక్రమార్క తెలియజేశారు.