గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు మరో అవకాశం

హైదరాబాద్ (CLiC2NEWS): గ్రూప్-3 దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థలు మరోసారి సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సెప్టెంబర్ 2 నుండి 6 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తుల్లో తప్పులుంటే అభ్యర్థులు సరిచేసుకోవాలని సూచించింది.