ఎపి సిఎంకు కృతజ్ఞతలు.. సిరివెన్నెల కుటుంబం

హైదరాబాద్ (CLiC2NEWS) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ కుటుంబానికి అండగా నిలిచారని సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం మృతిచెందిన విషయంతెలిసినదే. సిరివెన్నెల కుమారుడు సాయి యోగేశ్వర్ బుధవారం ఒక ప్రకటన వడుదల చేశారు. =మంగళవారం ఉదయం 10 గంటలకు ఎపి సిఎం జగన్ ఫోన్ చేసి నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. ఆసుపత్రి ఖర్చులన్నీ చెల్లించాలని ఆధికారులను సిఎం ఆదేశిచినట్టు చెప్పారు. నాన్న మృతి చెందిన తర్వాత సిఎం సంతాపం తెలిపారు. నాన్న అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్నినాని ఆసుపత్రి ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని, మేము కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని వెల్లడించారు. నాన్నగారి పట్ల ఇంత అభిమానం చూపించి, మాకుటుంబానికి అండగా నిలిచిన ఎపి సిఎం కు మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అని అన్నారు. ఇంకా సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సిఎం జగన్ ఆదేశించారని అధికారులు తెలిపారు.