ఆ ఒక్క `కేసు` మిస్టరీని ఛేదించిన న్యూజిలాండ్
వెల్లింగ్టన్ (CLiC2NEWS): ప్రపంచంలోనే కరోనా ను కట్టడి చేసిన దేశంగా న్యూజిలాండ్ ఉన్న విషయం తెలిసిందే. గత ఆరు నెలల కిందటే కరోనా ను జయించిందని అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంది. ఈ సంబరాలు ఏకంగా దాదాపు 50 వేల మందితో నిర్వహించింది. కూడా. అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యనే ఆక్లాండ్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో న్యూజిలాండ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
దాంతో ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఏకంగా 3 రోజుల పాటు కఠిన లాక్‌డౌన్ విధించారు. అనంతరం ఆ ఒక్క కేసు ఎలా వచ్చింది అన్న మిస్టరీని ఛేధించేందుకు పక్కాగా విచారణ జరిపింది.
ఆస్ట్రేలియాలో శరవేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ ఆ వ్యక్తికి సోకింది. అతడు ఈ నెల 7న సిడ్నీ నుంచి ఆక్లాండ్ వచ్చాడు అని విచారణలో తేల్చింది. దాంతో దేశంలో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సిడ్నీలోనే అతనికి కరోనా సోకిన తర్వాత ఆక్లాండ్ వచ్చిన రెండు రోజుల తర్వాత అతడికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దాంతో సిడ్నీ నుంచి వచ్చినప్పటి నుంచీ ఆ వ్యక్తి క్వారంటైన్‌లో, హాస్పిట్‌లోనే ఉన్నాడని ప్రధాని జెసిండా వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో 21 కరోనా కేసులు ఉన్నాయి.