మొగలిరేకులు ఫేమ్ ఆర్ కె సాగర్ హీరోగా.. ‘ది 100’..
The 100: మొగలి రేకులు సీరియల్‌లో పోలీస్ క్యారెక్టర్లో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఆర్‌కె సాగర్.. ప్రధాన పాత్రలో ది 100 చిత్రం జులై 11న రాబోతుంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ లాంచ్ చేశారు. చిత్ర టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొగలి రేకులు సీరియల్‌లో ఆర్‌కె నాయుడు అంటే తెలియనివారుండరు. ఆర్ కె నాయుడు, మున్నా రెండు పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో మిషా నారంగ్ కథానాయికగా నటించారు. ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకులు ముందుకు రానుంది.
