ముగిసిన 15వ రాష్ట్రపతి ఎన్నిక..

ఢిల్లీ (CLiC2NEWS): భారత 15వ రాష్ట్రపతి ఎన్నికకు నిర్వహించిన పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 99.18% పోలింగ్ నమోదైనట్లు చీఫ్ రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.లు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తొలి ఓటు వేశారు. తెలంగాణలో మంత్రి కెటిఆర్ తొలి ఓటు వేశారు. ఈనెల 21వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.