డూప్‌లేకుండా యాక్షన్ సీన్ చేస్తుండగా హీరో అజిత్‌కు ప్రమాదం..

Cinema news: సినిమా చిత్రీకరణ సమయంలో డూప్‌లేకుండా తానే స్వయంగా కారు నడపడంతో హీరో అజిత్ ప్రమాదానికి గురయ్యారు. తమిళ స్టార్ అజిత్ సినిమాలకు తెలుగు ప్రజల్లో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన విదా ముయార్చిలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ చేసి డూప్ లేకుండా నటించారు. కారు టైరులో గాలి పూర్తిగా తగ్గిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఉన్న ఆర్నవ్, అజిత్‌లను చిత్ర యూనిట్ వెంటే ఆస్పత్రికి తరలించింది. స్వల్పగాయాలతో వారు బటపడ్డట్టు సమాచారం. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుత్ఉన్న విదా ముయార్చి చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.