లోక్‌సభలో దుండగుల కలకలం.. ఎంపి కార్యాలయం నుండి పాస్‌లు..

ఢిల్లీ (CLiC2NEWS): లోక్‌సభ సమావేశం జరుగుతుండగా సభలోకి దుండగులు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరు విజిటర్స్ గ్యాలరీ నుండి కిందికి దూకి గందరగోళం సృష్టించారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారు 3 నెలల నుండి పక్కా ప్రణాళికతో ఈ దుస్సాహసానికి పాల్పడ్డారని పోలీసులు తెలుపుతున్నారు. అయితే వీరికి లోక్‌సభలోకి ఎంట్రీ పాస్‌లు బిజెపి ఎంపి ప్రతాప్సింహ కార్యాలయం నుండి వచ్చినట్లు సమాచారం. సందర్శనకు వచ్చిన వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడటంతో స్పీకర్ ఓం బిర్లా విజిటర్స్ పాస్‌ల జారీపై నిషేధం విధించారు. ఈ ఘటనపై స్పీకర్ దర్యాప్తుకు ఆదేశించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని వెల్లడించారు.
మైసూర్ ఎంపి ప్రతాప్ సింహ కార్యాలయం నుండి దుండగులకు పాస్‌లు లభించడంతో జలదర్శిని అతిథి గృహంలోని ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తున్నారు. కొత్త పార్లమెంట్ వీక్షిస్తామనే సాకుతో వారు పాస్‌లు పొంది ఉంటారని భావిస్తున్నారు. నిందితులు మూడు నెలల పాటు ప్రయత్నించి పాస్‌లు పొందినట్లు సమాచారం.
పోలీసులు అరెస్టు చేసిన వారు కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. అయితే వీరందరికీ నాలుగేళ్ల నుండి ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.