50 జంట‌ల‌కు సామూహిక వివాహాలు జ‌రిపించిన అంబానీ కుటుంబం

ముంబ‌యి (CLiC2NEWS): రిల‌య‌న్స్ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు వివాహం ఈ నెల 12వ తేదీన జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. పెళ్లి వేడుక‌లు షురూ అయ్యాయి. జులై 1 నుండి 3 వ‌రకు ప్రీవెడ్డింగ్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ వేడుక‌ల్లో అంబానీ కుటుంబం అక సామాజిక కార్య‌క్ర‌మాన్ని భాగం చేసింది. పేద కుటుంబాల‌కు చెందిన 50 జంట‌ల‌కు సామూహిక వివాహాలు జ‌రిపించారు. ఈ సంద‌ర్భంగా కొత్త జంట‌ల‌కు మంగ‌ళ‌సూత్రం, వివాహ ఉంగ‌రాలు, ముక్కుపుడ‌క‌, వెండి ప‌ట్టీలు, మ‌ట్టెలు కానుక‌గా అందించారు. అంతేకాక పెళ్లి కుమార్తెకు స్త్రీ ధ‌నం కింద రూ. 1.01 ల‌క్ష‌ల చెక్ అందిచారు.

Leave A Reply

Your email address will not be published.