‘అంబేద్క‌ర్ కోన‌సీమ’ జిల్లాకు ఎపి మంత్రివ‌ర్గం ఆమోదం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్యక్ష‌త‌న జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. కోన‌సీమ జిల్లాను అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా పేరు మార్పుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. పిఆర్సి జిఓలో చేసిన మార్పుల‌కు కేబినేట్ ఆమోద‌ముద్ర వేసింది.

జూన్ 27వ తేదీన అమ్మ ఒడి ప‌థ‌కానికి నిధులు విడుద‌ల‌తో పాటు అర్జున అవార్డు గ్ర‌హీత జ్యోతి సురేఖ‌కు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు కేబినేట్ ఆమోదం తెలిపింది. జులై నెల‌లో అమ‌లు చేయ‌నున్న నాలుగు సంక్షేమ ప‌థ‌కాలు విద్యాకానుక‌, కాపు నేస్తం, జ‌గ‌న‌న్న తోడు, వాహ‌న‌మిత్ర ప‌థ‌కాల‌కు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. వంశ‌ధార నిర్వాసితుల‌కు రూ. 216 కోట్ల ప‌రిహారం నిధులు విడుద‌ల చేసేందుకు కేబినేట్ భేటీలో నిర్ణ‌యం తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.