ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరపనున్న ఎపి ప్రభుత్వం ..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఓసారి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరనుంది. మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీలో పిఆర్‌సి పెండింగ్ అంశాలతో పాటు ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి) ఎపి ఐకాస అమరావతి మార్చి 9వ తేదీ నుండి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా చర్యలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎపి ఐకాస అమరావతి, ఎపి ఐకాస, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌లను మాత్రమే చర్చలకు ఆహ్వానించింది. సంఘానికి ముగ్గురు ప్రతినిధులు మాత్రమే సచివాలయంలో మంత్రులతో భేటీకానున్నారు.