అత్యుత్తమ ముద్ర .. మహా ముద్ర

ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. తరువాత ఎడమ మడమ మధ్యస్థానాన్ని నొక్కాలి. కుడి కాలిని జాపి బిగించి దీని బొటను వేలిని రెండు చేతులతోను పట్టుకోవాలి. శ్వాస లోపలికి తీసుకొని.. అలాగే అపి గడ్డాని ఛాతికి (జలందర బంధం) అనించాలి. కన్ను బొమ్మల మధ్య ధ్యానాన్ని కేంద్రికరించాలి. యధా శక్తి ఇదే స్థితిలో ఆగాలి. శ్వాసను వదిలి నెమ్మదిగా యధా స్థితికి రావాలి. రెండొవ కాలి మీద కూడా ఇదే క్రియను ఆచరించాలి. మూల బంధం వేయాలి.
ప్రయోజనాలు
1. ఈ ముద్ర వేయటం వలన విషం కూడా అరుగుతుంది.
2. భగందరం, మూలవ్యాధి. ప్లీహం పెరగటం, అజీర్ణం, మలబద్ధకం,వాయుదోషములు, జ్వరం, క్షయ, కుష్ఠు రోగాలు, నయం అవుతాయి.
3. ఊపిరితుత్తులలో ఆగిపోయిన గాలి కూడా బయట పడుతుంది.
4. సుషుమ్న ను, ప్రాణాలను ప్రవహింప చేసే గొప్ప ముద్ర. `మహాముద్ర` .
-షేక్. బహార్ ఆలీ.
యోగాచార్యుడు