AP: వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు
కదిరి (CLiC2NEWS): వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నిజాంవలి కాలనీలో చోటుచేసుకుంది. ఐదేళ్ళ బాలుడు యాసిన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి చెవి కొంత భాగం తెగి పడిపోయింది. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాలుడి అరుపులకు స్థానికులు కుక్కలను తరమి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కల బెడద లేకుండా చేయాలని బాలుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు.
Madhapur: ప్రభుత్వ పాఠశాలలో 44 మంది విద్యార్థులకు అస్వస్థత
[…] […]