వధువు సూపర్‌ డ్యాన్స్‌.. నెట్టింట్లో వీడియో హ‌ల్‌చ‌ల్‌..

హైదరాబాద్‌ (CLiC2NEWS): ఏ భాష‌లో అయినా మొట్ట‌మొద‌ట జాన‌ప‌ద సాహిత్య‌మే పుడుతుంది. తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉంది. జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది. అలాగే తెలంగాణలో జానపద పాటలు కోకొల్లలు. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ఆ పాటలే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఏ వేడుక ఉన్నా జానపదం పాటలు మార్మోగుతున్నాయి. తాజాగా ఓ వధువు తన బరాత్‌లో ఓ జానపద పాటకు సూపర్‌గా డ్యాన్స్‌ చేసి అంద‌రిని అశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఆ పాట `నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా` అనే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ పొందింది. రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఒక సంచ‌ల‌నం. ఈ క్రమంలోనే బరాత్‌లో వధువు `నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా` పాటకు డ్యాన్స్‌ చేసి అందరినీ క‌ట్టిప‌డేసింది. ఈ వీడియోను మీరు చూసి ఆనందించండి.

1 Comment
  1. zoritoler imol says

    I like what you guys are up too. Such intelligent work and reporting! Keep up the superb works guys I’ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my site 🙂

Leave A Reply

Your email address will not be published.