Mancherial: రామారావుపేట్‌లో `చైల్డ్‌లైన్ ఓపెన్‌హౌస్‌`

జైపూర్‌ (CLiC2NEWS): చైల్డ్ లైన్ మంచిర్యాల ఆధ్వర్యంలో జైపూర్ మండలం రామరావుపెట్ ప్రాధమిక పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు, బాలల హక్కులు, సమస్యలు, రక్షణ చట్టాలపై అవగాహన క‌ల్పించారు. బాలలు తమ యొక్క సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని.. హక్కుల, రక్షణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ముఖ్య వక్తలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన గ్రామ సర్పంచి నామాల సత్యవతి తిరుపతి, ఎంపిటిసి బాపు, ఉప సర్పంచి వెంకటేశం, డి ర్ డి ఏ ఏ పి మo రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు అరుణ శ్రీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

చైల్డ్ లైన్ డైరెక్టర్ జిజో, సమన్వయ కర్త సత్యనారాయణ, సిబ్బంది సురేష్ వరలక్ష్మి అజయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి, ఏ ఎన్ ఎం సునీత బాలలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరు బాలబాలికల సంరక్షణ కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి కాల్ చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.