AP: గుంత‌క‌ల్లులో పెళ్లిపీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు

అనంతపురం (CLiC2NEWS): కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. మ‌ర్యాద‌లు స‌రిగా లేవ‌ని బంధువులు వెళ్లిపోవ‌డంతో.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వధువు తేల్చి చెప్పడంతో పీటల మీద పెళ్లి ఆపేసిన ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంత‌క‌ల్లులో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లులో మర్యాదలు సరిగా లేవని వుధువు బంధువులు అలిగారు. దీంతో పెళ్లి కూతురు పెళ్లిపీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. అర్థాంతరంగా వధువు బందువులు పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు ఒక్క‌సారిగా షాక్‌కు గురయ్యారు. కాగా ఈ ఘటనపై వరుడు శేఖరాచారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Leave A Reply

Your email address will not be published.