తాడేపల్లిలో యువతి దారుణ హత్య..!

గుంటూరు (CLiC2NEWS): తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ యువకుడు అందురాలైన యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. తాడేపల్లిలోని ఎన్‌టిఆర్ కట్ట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతితో.. అదే ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం యువతి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లి దండ్రులు, స్థానికులు మందలించడంతో.. కక్ష పెంచుకున్న దుండగుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి.. పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.