జమ్మూ కశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం.. 36 మంది మృతి
శ్రీనగర్ (CLiC2NEWS): జమ్మూకశ్మీర్లో ప్రమాదవశాత్తూ ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందారు మరో 19 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో కూడా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూలోని డోడా జిల్లాలో జాతీయ రాహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటుచోసుకుంది. దాదాపు 55 మంది ప్రయాణికులతో కిష్త్వాఢ్ నుండి జమ్మూకి వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోయలో పడిపోయింది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
జమ్మూలోని బస్సు దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారికుటంబాలకు పిఎం సహాయ నిధి నుండి రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు పరిహారం ప్రకటించారు.