అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి

ఢాకా (CLiC2NEWS): 40 మందికిపైగా ప్రయాణికులతో అతి వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని మదరిపూర్ వద్ద జరిగింది. సోనాదంగా నుండి ఢాకాకు వస్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్‌తో పాటు మెకానికల్ వైఫల్యం కూడా కారణమని అధికారులు ప్రాథమింగా భావిస్తున్నారు.