ఆత్మ‌హ‌త్యకు ప్ర‌య‌త్నించిన మ‌హిళ‌ను కాపాడిన క్యాబ్ డ్రైవ‌ర్‌..

ముంబ‌యి (CLiC2NEWS): ముంబ‌యిలో ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఓ మ‌హిళ‌ను క్యాబ్ డ్రైవ‌ర్ కాపాడాడు. ముంబ‌యిలోని అట‌ల్ సేతు బ్రిడ్జిపై ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అక్క‌డే ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా ఆమెను కాప‌డంతో మ‌హిళ ప్రాణాలు ద‌క్కాయి. బ్రిడ్జిపై కూర్చున్న మ‌హిళ ముందుగా స‌ముద్రంలోకి ఏవో వ‌స్తువుల‌ను విసురుతూ ఉంది. త‌ర్వాత ఆమె కూడా అందులోకి దూక‌బోయింది. అది ప‌సిగ‌ట్టిన క్యాబ్ డ్రైవ‌ర్ ఆమె జుట్టును , చేతుల్ని ప‌ట్టుకోగ‌లిగాడు. అక్క‌డే పెట్రోలింగ్ చేస్తున్న‌ పోలీసులు త‌క్ష‌ణ‌మే స్పందించడంతో ఆమెను పైకి లాగారు. ఈ దృశ్యాలు ముంబాయి పోలీసులు ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు. విలువైన జీవితాల‌కు ఇలాంటి చ‌ర్య‌ల‌తో ముగింపు ప‌ల‌కొద్ద‌ని అభ్య‌ర్థించారు.

Leave A Reply

Your email address will not be published.