చెట్టుని ఢీకొని కారులో మంటలు.. వృద్ధ దంపతులు మృతి
ఖమ్మం (CLiC2NEWS): జిల్లాలోని బోనకల్ మండలం ముష్టికుంట్ల సమీపంలో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న మామిళ్ల గూడేనికి చెందిన దంపతులు సూర్యానారాయణ, రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులిద్దరినీ ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు.