విద్యుత్ తీగలు తగిలి చెట్టుమీదనే కన్నుమూసిన చిన్నారి..
బాపట్ల (CLiC2NEWS): జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి చిన్నారి చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ .. కరెంట్ తీగలపై పడి ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో చిన్నారి విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.